అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకోకుండా.. జోనల్ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పు : HCA

అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకోకుండా జోనల్ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పన్నారు.. HCA సీఈఓ పాండురంగారావు, HCA ఇంచార్జ్ ప్రెసిడెంట్  డా.కె.అనిల్ కుమార్.  మాజీ కార్యదర్శి శేష్ నారాయణ తీసుకునే నిర్ణయాలతో యువ క్రికెటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శేష్ నారాయణ పాత సెలెక్ట్ కమిటీని తీసుకువచ్చి.. ఒక టీమ్ సెలెక్ట్ చేయటంతో కర్ణాటకకు ఒక్క టీం కూడా సెలెక్ట్ కాలేదన్నారు. ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లటం మంచిది కాదన్నారు. లోధా కమిటీ నిర్ణయాల ప్రకారం సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలన్నారు HCA సీఈఓ, ఇంచార్జ్ ప్రెసిడెంట్.

Posted in Uncategorized

Latest Updates