అపోలో ఆస్పత్రిలో చేరిన డీఎంకే నేత స్టాలిన్

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్(65) బుధవారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యతో గత కొంత కాలంగా బాధ పడుతున్నాడు స్టాలిన్. సాధారణ చెకప్‌లో భాగంగానే స్టాలిన్ ఆస్పత్రిలో చేరాడని స్పష్టం చేశారు డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ టీఆర్ బాలు. రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా గత రెండు నెలల నుంచి మెడికల్ చెకప్ చేయించుకోలేదన్నారు. స్టాలిన్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని మీడియాకు చెప్పారు బాలు.

ఇదిలా ఉండగా కుడి తొడలో చిన్న కణితి ఉన్నందున అది తొలగించేందుకు సర్జరీ చేస్తున్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు స్టాలిన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు ఆసుపత్రి వర్గాలు. ఆగస్టు 7వ తేదీన కరుణానిధి మృతి చెందడంతో ఆగస్టు 28న స్టాలిన్‌ను డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన మరింత బిజీగా ఉండడం వల్ల సాధారణ హెల్త్ చెకప్‌ చేసుకోవడంలో జాప్యం జరిగిందన్నాడు బాలు.

Posted in Uncategorized

Latest Updates