అప్పటి వరకూ నిజమని నమ్మలేదు : జయప్రద

jpనటి శ్రీదేవి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జయప్రద. శ్రీ దేవి చనిపోయిందని తెలియగానే చెడు కల వచ్చేందేమో అని అనుకున్నానని, టీవీల్లో చూసే వరకు శ్రీదేవి చనిపోయిందన్న విషయాన్ని నమ్మలేదన్నారు. శ్రీదేవి, తాను కలిసి చాలా సినిమాల్లో పని చేశామని, మేము ఇద్దరం మంచి స్నేహితులమని జయప్రద తెలిపారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాకుండా గొప్ప తల్లి కూడా అని జయప్రద తెలిపారు. కూతురు జాన్వీకపూర్‌ను వెండితెరపై హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కనేదని, ఆ కల నెరవేరకుండానే ఆమె కన్నుమూసిందని జయప్రద విచారం వ్యక్తం చేశారు. కనీసం చివరి క్షణాల్లో జాన్వీకపూర్ తన తల్లి వద్ద లేదని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates