అల్ప పీడన ద్రోణీ ప్రభావం : ఇవాళ, రేపు భారీ వర్షాలు

RAINతెలుగు రాష్ట్రాల్లో నైరుతి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడొచ్చంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల సోమ (జూన్-11), మంగళ (జూన్-12)వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్‌ వాతావరణ  కేంద్రం.

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు అధికారులు. ఆదివారం (జూన్-10) ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, కొమురం భీమ్, సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ , యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు పడ్డాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.  సాయంత్రం తరువాత హైదరాబాద్ లోనూ చాలా చోట్ల వర్షం కురిసింది.

Posted in Uncategorized

Latest Updates