అప్పుడు ఒడిషా..ఇప్పుడు యూపీ

Body_shoulder17అంబులెన్స్ ఇవ్వడానికి హాస్పిటల్ నిరాకరించడంతో 12 కిలోమీటర్లు భార్య శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్లిన ఒడిషా సంఘటన ఇప్పటికీ ఇంకా దేశ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఫటనే మరోకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సాంబా సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ వ్యక్తి తన భుజంపై శవాన్ని మోస్తూ బైక్ పై అంత్యక్రియలకు తీసుకెళ్లిన సంఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం తన తాతకు పొలంలో సహాయం చేస్తున్న ఓ యువకుడికి గాయాలవ్వడంతో అతడిని స్ధానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్ కు వెళ్లిన వెంటనే భాధిత వ్యక్తి బంధువులను అప్పటికే అతడు చనిపోయాడని, శవాన్ని తీసుకెళ్లాలని డాక్టర్లు తెలిపారని, స్ట్రెక్చర్, అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో యువకుడి శవాన్ని అతని బంధువు భుజంపై మోసుకుంటూ బైక్ పై అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్ డాక్టర్లు మాత్రం దీనిని ఖండించారు. హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తులు ఫార్మాలిటీలు పూర్తి చేయకుండానే, ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే హాస్పిటల్ వదిలి వెళ్లారని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ డాక్టర్ అమృత సిన్హా మాట్లాడుతూ… కొంతమంది వ్యక్తులు చనిపోయిన యువకుడి శవాన్ని తీసుకొచ్చారు. హాస్పిటల్ యాజమాన్యం ఈ విషయం గురించి పోలీసులకు తెలియజేస్తున్న సమయంలో  భాధిత యువకుడి బంధువులందరూ ఒక్కసారిగా చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయారని, మాకు విషయం తెలియజేసినట్లయితే అంబులెన్స్ సౌకర్యం తప్పకుండా కల్పించేవాళ్లమని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates