అప్పుడు కెప్టెన్..ఇప్పుడు ప్రధాని : అధికారం దిశగా ఇమ్రాన్

పాకిస్థాన్ లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శకం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ పార్టీ పీటీఐ.. ఫలితాల్లో దూసుకెళ్తుంది. 272 స్థానాల్లో 114 సీట్లతో ఇమ్రాన్ పార్టీ ముందుజలో ఉంది. హంగ్ ఏర్పడితే పీపీపీ కింగ్ మేకర్ అవుతుందని బిలావల్ బుట్టో ఆశగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ –ఎన్  64 సీట్లలో, బిలావల్ బుట్టో పార్టీ పీపీపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ముత్తహిదా క్వామీ మూమెంట్  11 చోట్ల దూసుకుపోతోంది. 50కి పైగా స్థానాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. ఒకవేళ హంగ్  వచ్చే పరిస్థితులుంటే బిలావల్ బుట్టో పార్టీ పీపీపీ… కింగ్ మేకర్  కానుంది. లేకుంటే ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్  పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనబడుతోంది. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 35మంది చనిపోగా… అనేకమంది గాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates