అప్పుడే 40డిగ్రీలు : మండే ఎండలు వచ్చేశాయ్

SUMMER HYDఏప్రిల్ రాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనంలో ఆందోళన పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణ.. దక్షిణ తెలంగాణ తేడా లేకుండా.. 31 జిల్లాల్లో సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. వడగాడ్పుల ప్రభావం కూడా మొదలైంది. ఏప్రిల్, మే నెలల్లో.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎండలతో జాగ్రత్తగా ఉండకుంటే.. ఎవరికైనా ఇబ్బందే అని డాక్టర్లు సూచిస్తున్నారు.

హైదరాబాద్ లోనూ ఎండ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పొల్యూషన్ కు తోడు.. సిటీలో పెరుగుతున్న ఉష్ణోగ్రత.. విపరీతమైన ఉక్కపోత.. జనానికి చుక్కలు చూపిస్తోంది. మధ్యాహ్నానికి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 దాటడంతోనే మండుతున్న ఎండల ప్రభావం.. సాయంత్రం 6 దాటినా కొనసాగుతోంది. మార్చి నెలాఖరుకే ఇంతగా టెంపరేచర్ పెరిగితే.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందేమో అని జనం టెన్షన్ పడుతున్నారు.

పెరుగుతున్న ఎండలతో.. జనం జాగ్రత్తగా ఉండాలని అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. వృద్ధులు, పిల్లలు.. అత్యవసరమైతే తప్ప.. మధ్యాహ్నం సమయాల్లో ఇళ్లు దాటి బయటకు వెళ్లొద్దంటున్నారు.  వడదెబ్బ తగిలితే.. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. బయటికి వెళ్లేటపుడు.. ఎండ ప్రభావం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates