అప్పులిస్తారంట : SBI ఆధ్వర్యంలో రైతు రుణ మేళా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకున్నది. రైతు రుణ మేళా నిర్వహణకు సన్నద్ధం అయ్యింది. కిసాన్ మేళా పేరుతో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది SBI. జూలై 18వ తేదీ బుధవారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఒక వెయ్యి 550 గ్రామీణ, పట్టణ బ్యాంక్ శాఖల్లో ఈ కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పంట రుణాలు తీసుకున్న రైతులు ఈ మేళా ద్వారా ఖాతాలను పునరుద్ధరించుకోవచ్చు. అలా చేసుకున్న వారికి 10శాతం అదనంగా అప్పు ఇస్తామని ప్రకటించింది బ్యాంక్.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కోటి 50లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. వీటిని పునరుద్ధరించటంతోపాటు అంటే రెన్యువల్ చేసుకోవటంతోపాటు.. మరో 10 లక్షల రైతు ఖాతాలను ఈ మేళా ద్వారా ఓపెన్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది SBI. అదే విధంగా పంట రుణాలు తీసుకోవటం, చెల్లించటం, వడ్డీలు, వ్యవసాయ సంబంధ రుణాల మంజూరు విషయాలపై రైతులకు అవగాహన కూడా కల్పించనున్నారు అధికారులు. రెండు రాష్ట్రాల్లోని రైతులు.. కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు బ్యాంక్ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates