అప్పు మొత్తం కట్టేస్తా: విజయ్ మాల్యా

భారత బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయి తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.  బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 100 శాతం తిరిగి చెల్లిస్తానని విజయ్ మాల్యా ట్వీట్ చేశాడు.

’ అదంతా ప్రజల డబ్బు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం చెల్లిస్తా.. బ్యాంకులు,కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బును తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయానని, నేను రుణ ఎగవేతదారుడినని మీడియా, పొలిటికల్ లీడర్స్ పదేపదే చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదు. విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో విమానయాన కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొని నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాం. కానీ నేను తీసుకున్న అసలు మొత్తాన్ని మాత్రం పూర్తిగా చెల్లిస్తానని హామీ ఇస్తున్నా. దయచేసి తీసుకోండి. తమ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం అమ్మకాల సంస్థగా పేరొంది. ట్యాక్స్ రూపంలో దేశ ఖజానాకు వేల కోట్లను చెల్లించాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి’ అంటూ మాల్యా తెలిపాడు. అయితే అసలుతో పాటు సమానంగా ఉన్న వడ్డీల గురించి ఈ ట్వీట్లలో మాల్యా ఎక్కడా ప్రస్తావించలేదు.  బ్యాంకుల్నిసుమారు రూ.9,000 కోట్లు ముంచిన మాల్యా రెండేళ్లుగా లండన్‌లో ఉంటున్నాడు.

Posted in Uncategorized

Latest Updates