అప్ డేట్ చేశారు : వాట్సాప్ ఛేంజ్ నెంబర్ కు కొత్త ఫీచర్

wbఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ఛేంజ్‌ నెంబర్‌  ఫీచర్‌ ను శుక్రవారం (మార్చి 30)  వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్‌ నెంబర్లను యూజర్లు సులభంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోని  2.18.97 ఆండ్రాయిడ్‌ బీటా అప్‌డేట్‌కు అందుబాటులో ఉంది. తరువాత IOS, విండోస్‌ డివైజ్‌లకి కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

ఈ  ఫీచర్‌తో ఓల్డ్‌ ఛేంజ్‌ నెంబర్‌ ఫీచర్‌ కు మరిన్ని మెరుగులను అందించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఛాట్‌ హిస్టరీని కొత్త ఛాట్‌లోకి మార్చుకోవచ్చని, డూప్లికేట్‌ ఛాట్‌లను డిలీట్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ఈ ఛేంజ్‌ నెంబర్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నెంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక.. మీ కొత్త నెంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతోంది. కొత్త నెంబర్‌లోకి మారిన తర్వాత, పాత ఛాట్‌లో ఉన్న షేర్డ్‌ మెసేజ్‌లు‌, కొత్త దానిలోకి వస్తాయని తన ట్విట్ లో డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates