అఫ్ఘనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి: మృతుల కుటుంబాలకు మోడీ, సుష్మా సంతాపం

modiఅఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు. జలాలాబాద్ లోని మార్కెట్ లో జరిగిన.. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. ఆత్మాహుతి దాడి జరిగిన టైంలో అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా జలాలాబాద్ లోనే ఉన్నారు. స్థానిక గవర్నర్ ఆఫీస్ లో ఆయన ఉన్న సమయంలో దానికి కొద్ది దూరంలోనే ఈ దాడి జరిగింది.
ఆత్మాహుతి దాడిలో చనిపోయిన 11 మంది పేర్లను ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రకటించింది. వీరంతా పలు గురుద్వారాలు, సిక్కు సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నారని చెప్పారు. దాడి జరగడంతో కమిటీ.. అప్ఘాన్ సిక్కు ప్రతినిధులు భేటీ అయ్యారు. అఫ్ఘనిస్తాన్ లో ఉన్న సిక్కులకు భద్రత కల్పించాలని కోరారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సంతాపం తెలిపారు. దీనిని అఫ్ఘనిస్తాన్ లోని భిన్న సంస్కృతులపై దాడిగా అభివర్ణించారు ప్రధాని మోడీ. బాధలో ఉన్న అఫ్ఘనిస్తాన్ కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేశారు. ఇక.. ఇవాళ సాయంత్రం బాధితుల కుటుంబ సభ్యులను కలుస్తానని ట్వీట్ చేశారు సుష్మా స్వరాజ్.

Posted in Uncategorized

Latest Updates