అబ్బో…తెలుసా…ఒక ఇంట్లో 132 పాములు, పిల్లలు

cobra-babiesఅమ్మ బాబోయి…ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా ఓ ఇంట్లో 132 నాగుపాములు, పిల్లలు బయట పడ్డాయి. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భద్రక్‌ జిల్లా ధామ్‌నగర్‌ సమితి పయికోసాహి గ్రామంలో బిజయ్‌ భుయ్యా ఇంట్లో జరిగింది. ఈ పాములను స్నేక్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు పట్టుకున్నారు. ఐదారేళ్లుగా ఇంట్లో నాగుపాము కన్పిస్తోందని, దాన్ని పూజిస్తున్నామని చెప్పారు భుయ్యా. 21వ తేదీ రాత్రి ఇంట్లో చిన్నారులకు రెండు పాము పిల్లలు కన్పించాయి. వాటిని తండ్రికి చూపించారు. అవి ఇంట్లోని ఓ రంధ్రంలో దూరడంతో భుయ్యా అందులో ఫినాయిల్‌ పోశాడు. దీంతో నాలుగైదు పాము పిల్లలు బయటకు వచ్చాయి. భయపడిన కుటుంబీకులు రాత్రి పక్కింట్లో పడుకున్నారు. ఉదయం స్నేక్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధి షేక్‌ మీర్జాకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చారు. మట్టి ఇల్లు కావడంతో పలుచోట్ల పడిన రంధ్రాలను పరిశీలించగా మరిన్ని నాగుపాము పిల్లలు, గుడ్లు కన్పించాయి. పాములు పట్టేవారిని రప్పించి తవ్వి తీస్తుంటే శనివారం రాత్రికి 120 పాములు, పాము పిల్లలు, 25 గుడ్లు కనిపించాయి. ఆదివారం ఉదయానికి మొత్తం 132 పాములు బయటపడ్డాయి.

Posted in Uncategorized

Latest Updates