అబ్బ.. సూపర్ ఆఫర్ : 4 వేలకే మైసూర్ పట్టు చీర

KSIC-Mysore-Silk-Mysoreమహిళలకు ఓ శుభవార్త. ఇకపై తక్కువ ధరలకే మైసూరు పట్టు చీరలు మగువలకు అందనున్నాయి. కర్ణాటక ప్రభుత్వ పట్టు పరిశ్రమ సంస్థ వాటిని అందుబాటు ధరలకే అందించనుంది. ప్రస్తుతం ఆ చీరల ప్రారంభ ధర రూ.12వేలు ఉండటంతో సామాన్యులకు అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ చీరల్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు.. కర్ణాటక రాష్ట్ర  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.4 వేలకే పట్టు చీరను సామాన్యులకు అందించేందుకు రెడీ అయ్యింది . 2 నెలల్లో ఈ తక్కువ ధరల చీరల విక్రయాలు  ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మైసూరు పట్టు చీరకు సొబగులద్దేందుకు జరీలో 65శాతం వెండి, 0.5 శాతం బంగారం ఉపయోగిస్తున్నారు. ఒక్కో చీరకు 400 గ్రాముల జరీ వాడుతున్నారు. దీంతో వాటి ధర రూ.12వేల నుంచి రూ.2.7 లక్షల వరకు ఉంటోంది. ఈ ధరలను తగ్గించి సామాన్యులకు కూడా ఈ చీరల్ని అందుబాటులో ఉంచేందుకు వీలుగా జరీ పరిమాణాన్ని తగ్గించి.. వాటిని రూ.4వేలకు అందిస్తామని సంస్థ అధ్యక్షుడు సోమశేఖర్‌ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates