అభివృద్దిలోనే హరీష్ తో పోటీ : అన్నదమ్ముల్లా పెరిగామన్నకేటీఆర్

మంత్రి హరీశ్‌రావుతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. అభివృద్ధిలో మాత్రమే తామిద్దరం పోటీపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. గురువారం(సెప్టెంబర్-4) సిరిసిల్లలో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… హరీశ్ రావుతో ఎలాంటి విభేధాలు లేవని, తామిద్దరం అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని తెలిపారు. తామిద్దరం ఒకే కేబినెట్‌లో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. తామిద్దరం అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌ మరో 15 ఏళ్లు సీఎంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కేటీఆర్ పై హరీష్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆత్మహత్యల సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత కేటీఆర్‌దేనని హరీష్ అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్దిలో పోటా పోటీగా ముందుకెళ్లాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates