అభివృద్ది ఆగకూడదని : శ్మశానంలో నిద్రించిన MLA

HPఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు శుక్రవారం(జూన్-22) రాత్రంతా పాలకొల్లు శ్మశానంలోనే గడిపారు. శ్మశానికే భోజనం తెప్పించుకొని భోజనం చేసి అక్కడే ఓ మడతమంచం వేసుకొని నిద్రపోయారు. అయితే ఆయన శ్మశానంలో గడిపిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, వివిధ రాష్ట్రాలన సీఎంలు ఆయనను అభినందిస్తున్నారు. రామా నాయుడు చేసిన పనిని అభినందించారు. ఇంతకీ రామా నాయుడు శ్మశానంలో నిద్రించింది ఎందుకు అనుకుంటున్నారా?

పాలకొల్లు హిందూ శ్మశానవాటికలో జరగుతున్న అభివృద్ధి పనులను రామా నాయుడు ప్రతివారం సమీక్షిస్తున్నారు. అయితే శ్మశానం కావడంతో అక్కడ పనిచేసేందుకు కార్మికులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో పనుల్లో పురోగతి కన్పించకపోవడంతో కార్మికుల్లో ధైర్యాన్ని నింపేందుకు స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగారు. కార్మికులలో మనో ధైర్యాన్ని నింపేందుకు రాత్రంతా అక్కడే బస చేశారు. అక్కడే  రాత్రి పది గంటల వరకు పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంతేకాక ఆ బ్యాటరీ లైట్ వెలుగులోనే శ్మశానంలోనే భోజనం చేసి.. కార్మికులతో రాత్రంతా అక్కడే గడిపి.. మడత మంచంపై నిద్రపోయారు.  తిరిగి ఉదయం అక్కడే స్నానం చేశారు.

దీనిపై ఎమ్మెల్యే రామా నాయుడు మాట్లాడుతూ…. కనస్ట్రక్షన్ లో పాల్గొనేందుకు భయంతో కార్మికులు శ్మశానంలోకి వచ్చేందుకు భయపడుతున్నారని, దీని వల్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని, కార్మికుల్లో మనో ధైర్యం నింపేందుకు తానే శ్మశానంలో నిద్రించేందుకు రెడీ అయ్యానని, మరో నాలుగు రోజులు శ్మశానంలోనే నిద్రించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ శ్మశానవాటిక అభివృద్దిని నిర్లక్ష్యం చేశాయన్నారు. 2017లో ప్రభుత్వం ఈ శ్మశానవాటిక అభివృద్ది కోసం 3 కోట్లు కేటాయించిందని తెలిపారు. చనిపోయిన మృతదేహాలను తగులబెట్టేందుకు కొత్త ఫ్లాట్ ఫాంలు నిర్మిస్తున్నామని, బాత్ రూంలు, ఇతర అత్యాధునిక సౌకర్యాలతో శ్మశానవాటికను అభివృద్ది చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామా నాయుడు చేసిన పనిని ప్రశంసించారు కేరళ సీఎం పిన్నరయి విజయన్. రామా నాయుడు నిజంగా ప్రశంసలకు అర్హుడేనంటూ రామా నాయుడు చేసిన పనిని మొచ్చుకున్నారు. దోమలు కుడుతున్నా పట్టించుకోకుండా అభివృద్ది కోసం రామా నాయుడు శ్మశానంలో నిద్రించడం నిజంగా గ్రేట్ అంటూ స్ధానికులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates