అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ : డ్రోన్‌తో మూసీ నది సర్వే

DRONEమూసీ నది అభివృద్ధి, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌. మూసీ నది, చెరువుల అభివృద్ధిపై  క్యాంపు కార్యాలయంలో గురువారం (ఫిబ్రవరి-15) సమీక్షా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. ప్రధానంగా నగరంలోని మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రోన్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలని చెప్పారు.

గతంలో ఉన్న శాటిలైట్‌ మ్యాపులతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలని తెలిపారు. నదికి ఇరువైపులా రోడ్లు, పైనుంచి ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రణాళికలను రూపొందించా లని కేటీఆర్‌ చెప్పారు. అందు కోసం అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను అధ్యయం చేయాలని అధికారులకు మంత్రి తెలిపారు. రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జిల డిజైన్లు, నిర్మాణాలు చారిత్రక, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. వర్షకాలంనాటికి 50 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

చెరువులు కబ్జా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌తో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి,సుందరీకరణ ప్రణాళికలుసిద్ధంగా ఉన్నట్టు మంత్రి వివరించారు. దుర్గంచెరువు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వర్షకాలం నాటికి చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates