అభివృద్ధికి ముందడుగు : కొత్త పంచాయతీలు 4వేలు

VEERAVELLYఇచ్చిన హామీ కట్టుబడి.. ప్రజల దగ్గరకే పాలనలో లక్ష్యంగా పంచాయతీల పునర్విభజనకు అడుగు పడింది. కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వం తయారు చేసిన మార్గదర్శకాలు చూస్తే.. రాష్ట్రంలో 30 జిల్లాల నుంచి కొత్తగా 4 వేల 122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కానున్నాయి. ఇందులో 2వేల 243 తండాలు పంచాయతీలుగా మారనున్నాయి.

కలెక్టర్లు మండలాల వారీగా కొత్త పంచాయతీ ప్రతిపాదనలను మ్యాప్స్ తోసహా రూపొందించి.. పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8 వేల 684 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు కూడా అమల్లోకి వస్తే.. వాటి సంఖ్య 12 వేల 806కు చేరనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా..
ప్రభుత్వం హామీ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. శివారు గ్రామాలు, పల్లెలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించి.. వాటి ప్రకారం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే కొత్త పంచాయతీలు ఎక్కువగా ఏర్పాటు కానున్నాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates