అభివృద్ధిలో భాగ్యనగరం నెంబర్ వన్

Hyderabadవందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన హైదరాబాద్ ఇప్పటికే ఎన్నో ఘనతలను తన హిస్టరీ లో రాసుకుంది. విశ్వ నగరంగా మారుతున్న భాగ్య నగర కీర్తి కిరీటంలో తాజాగా మరో కలికితురాయి వచ్చి చేరింది. తక్కువ సమయంలోనే అభివృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ ఎల్ వార్షిక గ్లోబల్ రిపోర్టు ప్రకారం ..హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా..రెండో స్థానంలో బెంగళూరు.. నాలుగో స్థానంలో పుణె, కోల్ కతా 5వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీ 8వ స్థానం, చెన్నై14, ముంబై 20వ స్థానంలో నిలిచాయి. పట్టణాల ఆర్ధిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న 30 నగరాలను ఈ సూచీలోకి చేర్చింది. మానవ వనరులు, అనుసంధానత, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్రాపర్టీ ధరలు, ఆర్థిక ఉత్పాదకత,కార్పొరేట్ కార్యకలాపాలు, నిర్మాణం,రిటైల్ అమ్మకాల్లో భారత నగరాలు దూస్కెళ్తున్నాయి. షార్ట్ టర్మ్ మూమెంటమ్ ర్యాంకుల్లో భారత్ తన పూర్వవైభవాన్ని కొనసాగించింది. అంతర్జాతీయంగా జనాభా,ఆర్ధిక వృద్ధి పరంగా భారత నగరాలు అధిక రేటున నమోదుచేశాయి. దీర్ఘకాలం పాటు తమ వృద్ధిని కొనసాగించేందుకు  ఈ నగరాలు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లను తీర్చిదిద్దాలని, నివాసయోగ్యత, అందుబాటు ధరలు నియంత్రణలో పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates