అభివృద్ధిలో భారత్-రష్యాలు కలసి పనిచేస్తున్నాయి : మోడీ

PUTINషాంఘై కోఆపరేషన్స్ ఆర్గనైజేషన్ లో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడంలో రష్యా కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ కోసం భారత్-రష్యాలు కలసి పనిచేస్తున్నాయన్నారు. అలాగే బ్రిక్స్ లోనూ రెండు దేశాలు అవగాహనతో ముందుకు సాగుతున్నాయన్నారు. రష్యాలోని సోచి నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అనధికారిక సదస్సులో పాల్గొన్నారు మోడీ. తనను అనధికార సదస్సుకు ఆహ్వానించిన వ్లాదిమిర్ పుతిన్ కు థ్యాంక్స్ చెప్పారు మోడీ. ఇండియా-రష్యా సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలపైనా… చర్చించినట్టు ట్వీట్ చేశారు మోడీ. తర్వాత ఇద్దరు నేతలు కలిసి బోట్ రైడ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates