అభివృద్ధి అంటే అమరావతేనా: పవన్

pawanఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని… ఇక్కడ అభివృద్ధిని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం(మే-31) విజయనగరంలో పోరాట యాత్రలో భాగంగా పార్వతీపురం బహిరంగ సభలో మాట్లాడారు.

అభివృద్ధి అంటే అమరావతేనా అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్. హైదరాబాద్ లో చేసిన తప్పే సీఎం చంద్రబాబు… ఇప్పుడు కూడా చేస్తున్నారన్నారు.  అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అభివృద్ధి అంతా హైదరాబాద్ కే పరిమితం చేశారని.. దాని ఎఫెక్ట్ ఏమిటో రాష్ట్ర విభజనతో అందరం చూశామన్నారు. అదే తప్పును ఇప్పుడు చేస్తున్నారనీ అభివృద్ధి అంతా అమరావతి, విజయవాడ, గుంటూరుకే పరిమితం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకుకాళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో కళింగ, సీమ ఉద్యమాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు జనసేనాని పవన్.

Posted in Uncategorized

Latest Updates