అభ్యర్థుల గెలుపు.. సంబరాలపై ఆంక్షలు

హైదరాబాద్ : రాజకీయ పార్టీలను ఉత్కంఠకు గురి చేసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన తర్వాత… కార్యకర్తలు చేసుకునే సంబరాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. గెలుపొందిన అభ్యర్థి.. తమ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనీయకుండా 144 సెక్షన్‌ అమలు చేసింది. ఈమేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, వీసీ సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌ నిషేధాజ్ఞల్ని జారీ చేశారు.

కౌటింగ్ కేంద్రాల నుంచి ప్రధాన రహదారులపైకి వచ్చిన తర్వాత ఎలాంటి హంగామా చేయరాదని తెలిపారు. పార్టీల శ్రేణుల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. గెలుపొందిన..ఓడిపోయిన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు.  మూడు కమిషనరేట్ల పరిధిలో మంగళవారం డిసెంబర్-11న ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు కమిషనర్లు. ఈ ఆదేశాల కారణంగా ర్యాలీల నిర్వహణకు, బాణసంచా పేల్చడానికి వీల్లేదు. అయిదుగురికంటే ఎక్కువ మంది గుంపుగా వెళ్లేందుకు అనుమతించరు. 24 గంటలపాటు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. షాపులను మూసివేయడంతోపాటు బార్లు, స్టార్‌ హోటళ్లు, క్లబ్బుల్లోనూ విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates