తెలంగాణ దినోత్సవం : అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి

KCRతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం (జూన్-2) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.  హైదరాబాద్ లోని అసెంబ్లీ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. సీఎంతో పాటు కేకే ఉన్నారు. అమరవీరుల స్థూపం పుష్పగుచ్ఛం ఉంచారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అటు నుంచి పరేడ్‌ గ్రౌండ్స్‌ కు సీఎం కేసీఆర్ బయల్దేరారు.  11 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. జెండా ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. పోలీసులకు అవార్డులు ప్రదానం చేస్తారు సీఎం కేసీర్.

Posted in Uncategorized

Latest Updates