అమరవీరులకు వందనం: ‘కార్గిల్ విజయ్ దివస్’

జులై 26…ఈ రోజు దేశమంతా కార్గిల్ దివస్ జరుపుకుంటోంది. సరిగ్గా 19ఏళ్ళ క్రితం ఇదే రోజు పాకిస్తాన్ పై  భారత్‌ అఖండ విజయాన్ని సాధించింది. దేశంలోకి చొరబడిన ముష్కరులపై మన జవాన్లు 60 రోజుల పాటు పోరాటం సాగించి దేశానికి విజయాన్నిఅందించారు. అదే కార్గిల్‌ యుద్ధం.. వందల మంది సైనికుల ప్రాణత్యాగ ఫలం. 1999 మే నెలలో మొదలైన కార్గిల్‌ యుద్ధం రెండు నెలల పాటు జరిగి… జులై 26న ముగిసింది. దీంతో ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా జరుపుకొంటున్నాం. కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని భారత ఆర్మీ ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ-కార్గిల్‌ 1999’ పేరుతో వీడియో విడుదల చేసింది. ఈ పోరాటంలో 700 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కార్గిల్ యుద్ధంలో పాక్ పై భారత్ విజయం సాధించి ఇవాళ్టితో 19 ఏళ్లు పూర్తి చేసుకుందని…యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. ఆపరేషన్ విజయ్ సందర్భంగా ఒక అసాధారణ పొలిటికల్ లీడర్ షిప్ ను అందించిన మాజీ ప్రధాని వాజ్ పేయిని దేశమంతా ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. ఎవరైతే శాంతిని నాశనం చేయాలని చూశారో వారికి మన సైనికులు తగిన బుద్ధి చెప్పారని ట్వీట్ చేశారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates