అమరావతి టీడీపీ రాజధానిలా ఉంది: పవన్ కల్యాణ్

pkబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. అమిత్‌షా బీజేపీకి అధ్యక్షుడు మాత్రమేనని భారత ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి అని అన్నారు. అటువంటి వ్యక్తి రాసిన లేఖను సీరియస్‌గా తీసుకోనవసరం లేదన్నారు. హైదరాబాద్ లో  సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు  పవన్.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్మిస్తున్న అమరావతి తెలుగుదేశం పార్టీ రాజధానిలా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రత్యేక హోదా అక్కరలేదని చెప్పిందని…వైసీపీ  ఎన్నడూ చిత్తశుద్ధితో పోరాటం చేయలేదని విమర్శించారు.

అభివృద్ధి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను పుష్కరాల కోసం ఖర్చుపెట్టారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్. మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర సర్కార్‌ విఫలమైందన్నారు. ప్రజలకోసం కనీసం చేయాల్సినవి కూడా డీడీపీ,బీజేపీ చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో సరైన విద్య, వ్యవసాయం, వైద్యం లేవని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సర్దుకుపోయే ధోరణితో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగిందన్నారు పవన్ కల్యాణ్.

ఏపీ ప్రజలు కొత్త రాజకీయం కోరుకుంటున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. టీడీపీ నాలుగేళ్ల పాటు కనీసం అఖిలపక్షం కూడా వేయలేదన్నారు. బీజేపీ, టీడీపీలు బాధ్యతలను విస్మరించాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అసలు పట్టించుకోనే లేదన్నారు. అయిత్ షా లేఖ అంతా బుకాయింపులేనన్నారు. విభజన హామీల కోసం జనసేన, సీపీఐ, సీపీఎంలు కలిసి ఉద్యమం చేపడతామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లాడిలా ఏపీ పరిస్థితి ఉందన్నారు. రాయలసీమతో ప్రారంభించి ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. విభజన చట్టంలో చెప్పినవేవీ జరగడం లేదన్నారు మధు.

Posted in Uncategorized

Latest Updates