అమరుడా నీకు వందనం : ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాను మృతి

జమ్ముకశ్మీర్‌ లో జరిగిన ఎదురుకాల్పుల్లో కుమ్రం భీం జిల్లాకు చెందిన జవాను మృతిచెందారు. చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ గ్రామానికి చెందిన జవాను రాజేష్ శ్రీనగర్‌ లో సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం రాజేశ్‌ డెడ్ బాడీ రవీంద్రనగర్‌ చేరుకోనుంది. రాజేష్ మృతితో రవీంద్రనగర్‌ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Posted in Uncategorized

Latest Updates