అమరుల పిల్లలను నా స్కూల్లో చదివిస్తా: సెహ్వాగ్‌

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతీఒక్కరు తీవ్రంగా స్పందిస్తున్నారు. దాడిని ఖండించడంతో పాటు తమ ఉదారతను చాటుకుంటూ సాధ్యమైనంత సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే..భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందు కొచ్చాడు. ‘అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే.. నేను వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా. నా ‘సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో వారికి విద్యను అందజేస్తాను’అని ట్విట్టర్‌లో వీరూ పోస్ట్‌ చేశాడు.

Latest Updates