అమర్ నాథ్ యాత్రకు సెక్యూరిటీ టైట్…ఏర్పాట్లను పరిశీలించిన రక్షణ మంత్రి

AMRవైపు ఉగ్రవాదుల భయం.. మరోవైపు కఠిన వాతావరణ పరిస్థితులు.. దీంతో అమర్ నాథ్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. ఓ వైపు భారీగా బలగాలను మోహరిస్తూనే.. విపత్తు నిర్వహణ పనులకు సమాయత్తమవుతోంది. రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఏర్పాట్లను పరిశీలించారు. అమర్ నాథ్ యాత్రికులపై మిలిటెంట్లు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

అమర్ నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కశ్మీర్ లో పర్యటించారు రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి.. బల్ తల్ బేస్ క్యాంప్ ను విజిట్ చేశారు. తర్వాత ఇద్దరు వెళ్లి గవర్నర్ నరేంద్రనాథ్ వోహ్రాతో సమావేశమయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. కొంతమంది ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసు అధికారులను ఎంపిక చేసి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమర్ నాథ్ యాత్రపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 20 మంది లష్కరే తొయిబా మిలిటెంట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రెండు గ్రూపులుగా విడిపోయిన వీరు.. కంగన్ ఏరియాలో దాడులు చేసే అవకాశముందన్నారు.

Posted in Uncategorized

Latest Updates