అమర్ నాథ్ యాత్రకు సెక్యూరిటీ టైట్

amarఅమర్ నాథ్ యాత్రకు జమ్ముకశ్మీర్ లో పోలీసులు గట్టి భద్రత కల్పించారు. ఉగ్రవాద కదలికలు బాగా పెరిగిపోవడంతో…ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ కమెండోలు, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు అమర్ నాథ్ యాత్ర పొడవునా మోహరించారు. బల్తాల్ బేస్ స్టేషన్ లో అడుగడుగునా బందోబస్తు పెట్టారు. అమర్ నాథ్ యాత్ర సందర్భంగా.. కశ్మీర్ లో టూరిస్టుల సందడి కనిపిస్తోంది. బల్తాల్ నుంచి.. గుర్రాల దారిని సిద్ధం చేశారు. యాత్రికులు, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాత్రికుల రాకకోసం ఎదురుచూస్తున్నామని గుర్రాల యజమానులు అంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates