అమర్ నాథ్ యాత్రలో అపశృతి : రంగారెడ్డి జిల్లా మహిళ మృతి

DEATHఅమర్‌ నాథ్ యాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. కొండపై నుంచి బండరాళ్లు దొర్లిపడటంతో ఓ మహిళా యాత్రికురాలు చనిపోయింది. రంగారెడ్డి జిల్లా శేర్‌ లింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లారు. గురువారం (జూలై-5) యాత్ర చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన బండరాయి లక్ష్మిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

భారీ వర్షాల క్రమంలో అమర్‌నాథ్ యాత్రను గురువారం (జూలై-6) మళ్లీ నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో భాగ్‌ వతినగర్ బేస్ క్యాంప్ నుంచి వయా పెహల్‌ గాం, బల్తాల్ దారుల గుండా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఉధంపూర్ వద్ద నిలిచిపోయిన 1,798 మంది యాత్రికులను పెహల్‌ గాం వరకు వెళ్లడానికి అనుమతించామని చెప్పారు. పెహల్‌ గాం, బల్తాల్‌ లో హెలికాప్టర్ సేవలను కుదించినట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates