అమర్ నాథ్ యాత్రలో అపశ్రుతి : ఇద్దరు తెలుగువారు మృతి

amarnathఅమర్ నాథ్ యాత్రికులకు వాతావరణం ఇబ్బందిగా మారింది. దీంతో యాత్రికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే పటువురు మరణించగా..ఆదివారం (జూలై-8) అమర్‌నాథ్‌ యాత్రలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు యాత్రికులు మృతి చెందారు. బాల్తాల్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద హైదరాబాద్‌ కు చెందిన లక్ష్మీబాయి (54) గుండెపోటుతో మృతిచెందారు. ఏపీకి చెందిన రవీంద్రనాథ్‌ (72) అస్వస్థతకు గురై శ్రీనగర్‌ లోని స్కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates