అమితాబ్ లుక్ రిలీజ్ చేసిన సైరా టీం

మెగాస్టార్  చిరంజీవి హీరోగా యాక్ట్ చేస్తోన్న 151వ చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్ ఫస్ట్ లుక్ లను వారి బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ రిలీజ్ చేస్తోంది.

ఇక సైరాలో లీడ్ రోల్ లో నటిస్తున్న బిగ్ బి అమితాబ్ ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇవాళ(అక్టోబర్.11) బిగ్ బి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. రాజగురువు గోసయి వెంకన్న పాత్రలో బిగ్ బి నటిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్ష‌న్ బ్యానర్ పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని సురేందర్  రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. నయన తార హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates