అమిత్ షా ట్వీట్ కు….కేటీఆర్ కౌంటర్

ప్ర‌ధాన‌మంత్రి మోడీ గారిచే ప్రారంభించ‌బ‌డిన‌ “జ‌న ఆరోగ్య యోజ‌న- ఆయుష్మాన్ భార‌త్” కార్య‌క్ర‌మం ప్ర‌పంచంలోనే చాలా గొప్ప‌దని, అలాంటి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌రమని తెలుగులో అమిత్ షా చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.

అమిత్ షా పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయుష్మాన్ భారత్ తో పోల్చిచూస్తే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఎక్కువమంది ప్రజలు లబ్ది పొందగలుగుతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో కేవలం 25 లక్షల మంది లబ్ది పొందుతారని….ఆరోగ్య శ్రీ ద్వారా 80 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కవరేజ్ లో తెలంగాణ రోల్ మోడల్ అని కేటీఆర్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates