అమిత్ షా తో పరిపూర్ణానంద భేటీ

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరగనుందా… తన ధార్మిక ప్రసంగాలతో పెద్ద ఎత్తున అభిమానుల్ని సొంతం చేసుకున్నస్వామి పరిపూర్ణానంద రానున్న రోజుల్లో సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే.. అవుననే మాటలు విన్పిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అలాంటి కీలక పదవిని తెలంగాణలో స్వామి పరిపూర్ణాంద పొందే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ కి రావాలంటూ పిలుపొచ్చింది. షా ఆహ్వానం తో పరిపూర్ణానంద స్వామి ఢిల్లీకి చేరుకున్నారు.సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, పరిపూర్ణానందల మధ్య రాజకీయ చర్చ సాగినట్లుగా తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates