అమిత్ షా ధీమా : చంద్రబాబు పోతే.. నితీశ్ వచ్చారు కదా

AMITH MODI

దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారని చెప్పారు బీజేపీ చీఫ్ అమిత్ షా. మోడీ తమకు నాయకుడవ్వడం గర్వంగా ఉందన్నారు. అద్భుతమైన పథకాలతో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా శనివారం (మే-26) ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. NDA నుంచి టీడీపీ వెళ్లిపోయినా.. నితీశ్ కుమార్ చేరికతో లెవెల్ అయిందన్నారు.

2014 ఎన్నికల తర్వాత 11 పార్టీలు NDAలో చేరాయని.. కూటమి మరింత బలపడిందన్నారు అమిత్ షా. మహారాష్ట్రలో శివసేనతో కలిసే పోటీ చేస్తామన్నారు. అత్యధికంగా శ్రమించే ప్రధానమంత్రిని బీజేపీ అందించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజులో 15 నుంచి 18 గంటలు పని చేస్తారని తెలిపారు. అలాంటి నాయకుడ్ని దేశానికి అందించినందుకు బీజేపీ చాలా గర్వపడుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడ్ని దేశానికి అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని తెలిపారు అమిత్‌ షా.

Posted in Uncategorized

Latest Updates