అమిత్ షా షోలు నడ్వవు.. 5 సీట్లు గెలిస్తే ఎక్కువన్న కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : అమిత్ షా కరీంనగర్ లో పాడిందే పాడరా అన్నట్టు మాట్లాడారని విమర్శించారు మంత్రి కేటీఆర్. వేములవాడలో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు… రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం లేదు అన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పన్ను తెలంగాణ నుండి కడుతున్నాం అన్నారు. తెలంగాణ లోని సంక్షేమ పథకాలృను బీజేపీ కేంద్ర మంత్రులు చూసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన దాని కంటే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న IT రంగంలో, విద్యుత్ రంగంలో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం అని చెప్పారు.

“అమిత్ షాను సవాల్ చేస్తున్నా. రాం మందిర్ పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టి, కనీసం రాం మందిర్ కూడా కట్టలేదు. అన్ని మతాల వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుంది. నిజమైన సెక్యులర్ పార్టీ, దేశానికి ఆదర్శం మా టీఆర్ఎస్ అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఎన్ని స్థానాల్లో డిపాజిట్ వస్తాయో చూస్తాం. తెలంగాణ లో అమిత్ షా షో లు నడవవు. 5 సీట్లు తెచ్చుకోండి చూద్దాం. ఇంకా 9 నెలల సమయం ఉంది. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కాంగ్రెస్ వాళ్లు సీట్ల పంపిణీ చేసే లోపు మేము స్వీట్ల పంపిణీ చేసుకుంటాం” అన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates