అమీర్‌పేట-ఎల్బీనగర్ మార్గం ఆగస్టులో ప్రారంభం

nvs-reddyప్రస్తుతం మెట్రో రైలులో రోజుకు సగటున 80వేల మంది ప్రయాణిస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అమీర్‌పేట-ఎల్బీనగర్ మార్గంలో ఎలక్ట్రిసిటీ టెస్ట్న్ జరుగుతోందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. జులై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు ఆయన. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గాన్ని అక్టోబర్‌లో ప్రారంభిస్తామన్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం వచ్చే మార్చిలోపు పూర్తిచేస్తామని తెలిపారు. పాతబస్తీలో మెట్రో కోసం భూసేకరణపై చర్చలు జరుగుతున్నాయి. మెట్రో రెండోదశలో అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామన్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో అందుబాటులోకి తెస్తామని చెప్పారు ఎన్వీఎస్ రెడ్డి. మెట్రోపిల్లర్లకు యూనిక్ నంబర్లు ఇస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates