అమీర్ ఖాన్ తో నటించాలని ఉంది.. మానుషి

manussgfdsfమిస్ వరల్డ్ గా నిలిచిన చాలా మంది భారతీయ మహిళలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకోవడం మనం చూశాం. ఇప్పుడు అదే జాబితాలో తాను కూడా చేరబోతున్నానంటోంది మానుషీ చిల్లర్. ఇటీవల మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ భారతీయ సుందరి తన తరువాత లక్ష్యం సినిమాలే అని తేల్చి చెప్పింది. బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్‌ నటన అంటే చాలా ఇష్టమని, అతడితో కలసి న‌టించాల‌ని ఉంద‌ని ఈ సుందరి తెలిపింది. అమీర్ సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు సందేశాత్మ‌కంగా ఉండ‌డంతో అమీర్‌తో క‌లిసి ఓ సినిమా త‌ప్ప‌క చేస్తాన‌టోంది. ఓ మ్యాగజైన్  క‌వ‌ర్ పేజ్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్న ఈ సుందరి హాట్ హాట్ స్టిల్స్ తో అదరగొట్టింది. హాట్ గా కన్పిస్తున్న ఈ సుందరి ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates