అమీర్ పేట్-LB నగర్ మెట్రో : పిల్లర్లపై చరిత్ర, సంస్కృతి

హైదరాబాద్ లో మరో రూట్ లో మెట్రో పరుగులు తీసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (సెప్టెంబర్-24)న LB నగర్-అమీర్ పేట్ మెట్రో రూట్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే ఈ రూట్ లోని పిల్లర్లన్నీ ప్రజలను ఎట్రాక్ట్ చేయనున్నాయి. ఈ రూట్ లో చారిత్రాత్మక కట్టడాలు ఉండటంతో.. వీటిని మరింత ఎట్రాక్ట్ చేసేలా మెట్రో పిల్లర్లపై బొమ్మలు వేయాలని శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

ఇంజినీర్ల టీమ్ పర్యటించి.. డిజైన్లు రూపొందించారు. కారిడార్ 1లోని నాంపల్లి చాదర్‌ ఘాట్ పోలీసు కంట్రోల్ రూం వరకు 5 కిలోమీటర్ల మార్గంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను పరిశీలించారు.  ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, రంగమహల్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో పనులను తనిఖీ చేశారు. అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, OMC, MGBS స్టేషన్ల మధ్య ఉన్న ప్రాంతాల్లో తిరిగి చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు.

ఈ ప్రాంతంలో ఫుట్‌ పాత్‌లు నిర్మించాలని నిర్ణయించారు. చారిత్రక కట్టడాల రూపురేఖలు మారకుండానే వింటేజ్ లుక్ వచ్చేలా విద్యుత్‌ స్తంభాలు, టైల్స్, రాళ్లు అమర్చి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.  నాంపల్లి, గాంధీభవన్ స్టేషన్ల వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మెట్రో అధికారులు. ప్రయాణికులను ఎట్రాక్ట్ చేసేలా పేయింటింగ్స్, డెకరేషన్ చేయనున్నట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates