అమీర్ పేట్-LB నగర్ : 27న మెట్రో రైట్..రైట్

metro hydహైదరాబాద్ సిటీ ప్రజలకు మరోరూట్ లో త్వరలోనే ట్రాపిక్ కష్టాలు తగ్గనున్నాయి. LB నగర్-అమీర్ పేట్ రూట్ లో మెట్రో కూత మోగనుంది. ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు రంగం సిద్ధం చేస్తున్నారు. జూలై 27న LB నగర్-అమీర్ పేట్ రూట్ లో మెట్రో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.

16 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రూట్ లో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ  రూట్ లో మెట్రోను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది హైదరాబాద్‌ మెట్రో రైల్‌(HMR ). దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రూట్ లో  75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా.

 

Posted in Uncategorized

Latest Updates