అమెజాన్‌ కార్మికుని వేతనం గంటకు 15 డాలర్లు


అమెరికా : అమెరికాలోని తన స్టోర్స్‌లో పని చేసే కార్మికుల కనీస వేతనాలు పెంచింది అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌. వచ్చే నెల నుంచి గంటకు వీరికి ఇచ్చే కనీస వేతనాన్ని15 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది అమెజాన్‌ యాజమాన్యం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,090కు సమానం. దీంతో 3.5 లక్షల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. అమ్మకాలు, లాభాలు పెరుగుతున్నా అమెజాన్‌తో సహా పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, వారి చేత గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పెంచిన వేతనాలు అన్ని తరగతుల కార్మికులకు వర్తిస్తాయని ప్రకటించింది అమెజాన్‌.

Posted in Uncategorized

Latest Updates