అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌కు పోటీ: ఇక గూగుల్లో కూడా కొనుక్కోవచ్చు

ేేంనాగూగుల్ లో సెర్చ్ చేస్తే  తో ఏ విషయాన్నైనా క్షణాల్లో మన ముందుంచుతుంది.ఆ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తమ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు రెడీ అవుతోంది. నచ్చిన వస్తువును వెతికి పెట్టడంతో పాటు…దాన్ని ఆన్ లైన్లో వారు కొనుగోలు చేసేలా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉంది. అది కూడా భారత మార్కెట్ నుంచే ప్రవేశం చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి పండుగ నుంచి సేవలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్…ప్లిప్ కార్టులో 77శాతం వాటాను 1,600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. వాల్ మార్ట్ తో కలిసి గూగుల్ కూడా ప్లిప్ కార్టులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే తన అభిప్రాయాన్ని మార్చుకున్న గూగుల్ సొంతంగానే ఆన్ లైన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

గూగుల్ ఇ-కామర్స్ పై ఆసక్తి పెరిగిందనడానికి సంస్థ తాజాగా కుదుర్చుకున్న డీల్ స్పష్టమైన సంకేతాలిస్తోంది. చైనాకు  చెందిన ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ జేడీ డాట్కామ్ లో 55 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. జెడి మార్కెట్ వాటాను మరింత పెంచేందుకు కలిసి కృషి చేయాలన్న వ్యూహంలో భాగంగానే గూగుల్ ఈ పెట్టుబడులు పెట్టింది. దీన్ని బట్టి చూస్తే ఆన్ లైన్ బిజినెస్ కి ప్రధాన మార్కెట్లుగా మారిన భారత్, చైనా లపైనే గూగుల్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు దాదాపు ఏడాది క్రితం నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇ- కామర్స్ ప్లాట్ ఫాంపై వస్తువులను అమ్మేందుకు గూగుల్ ఇప్పటికే  15 వేలకు పైగా వ్యాపారులను గుర్తించినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates