అమెజాన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

ఈ కామర్స్  దిగ్గజం అమెజాన్.. అమెరికాలో పనిచేస్తున్న తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 2.5 ల క్ష‌ల మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు హాలీడే సేల్స్ కోసం తాత్కాలికంగా తీసుకున్న లక్ష‌  మంది సీజనల్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని కంపెనీ తెలిపింది.

పెరిగిన వేతనం ప్రకారం రోజుకి(8 గంటల వర్క్) ఉద్యోగులు సుమారు రూ.8వేలు కనీస వేతనంగా అందుకోనున్నారు. కనీస వేతన పెంపు దిశగా  తొలి అడుగు వేయాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని..మిగిలిన సంస్థలు కూడా ఇదే విధంగా చేయాలని కోరింది.

Posted in Uncategorized

Latest Updates