అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్ : భారీ డిస్కొంట్స్ ఇస్తున్నారు.. చూసుకోండి

iphoneఐఫోన్లపై బిగ్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్. ఐఫోన్ ఫెస్ట్ పేరుతో డిస్కొంట్స్ ప్రకటించింది. జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయి అని ప్రకటించింది. ఇప్పట్లో కొత్త వెర్షన్ వచ్చే అవకాశం లేకపోవటంతో ఐఫోన్ – అమెజాన్ సంయుక్తంగా ఈ డిస్కొంట్ ఫెస్ట్ ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అత్యధికంగా రూ.10వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ ఇంత భారీగా డిస్కొంట్స్ ప్రకటించటం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా HDFC డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపినట్లు అయితే స్పాట్ డిస్కొంట్ కూడా ఇస్తోంది.

ఏయే ఫోన్లపై ఎంతెంత డిస్కొంట్ ఉందో చూద్దాం :

ఐఫోన్ ఎక్స్ (X) : అసలు ధర రూ.95,390గా ఉంది. ఈ ఆఫర్ కింద స్టార్టింగ్ ధర రూ.84,999గా నిర్ణయించింది.

ఐఫోన్ 8 ప్లస్ : అసలు ధర రూ.77,560, ఈ ఆఫర్ కింద స్టార్టింగ్ ధర రూ.71,999 (స్పాట్ డిస్కొంట్ రూ.3వేలు అదనం)

ఐఫోన్ 8 : అసలు ధర రూ.67,940, ఈ ఫెస్ట్ కింద స్టార్టింగ్ ధర రూ.59,999 ( స్పాట్ డిస్కొంట్ రూ.2వేలు అదనం)

ఐఫోన్ 7 : డిస్కొంట్ కింద లభించే ధర రూ.43,999 (స్పాట్ డిస్కొంట్ రూ.2 వేలు అదనం)

ఐఫోన్ 6S ప్లస్ : డిస్కొంట్ కింద లభించే ధర రూ.33,999 (స్పాట్ డిస్కొంట్ రూ.1,500 అదనం)

ఐఫోన్ 6 : డిస్కొంట్ కింద లభించే ధర రూ. 23,999 (స్పాట్ డిస్కొంట్ రూ.1,250 అదనం)

ఐఫోన్ SE : డిస్కొంట్ కింద లభించే ధర రూ.17,999 (స్పాట్ డిస్కొంట్ రూ.1,000 అదనం)

స్పాట్ డిస్కొంట్ కావాలి అంటే HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 12వ తేదీ వరకు మాత్రమే.

 

Posted in Uncategorized

Latest Updates