అమెరికాతో మరిన్ని సంబంధాల కోసమే ఇండియా టూర్ : నిక్కిహాలి

AMERIACAభారత్-అమెరికా  సంబంధాలు  మరింత  బలపడాలని  కోరుకుంటున్నామన్నారు  ఐక్యరాజ్యసమితిలో  అమెరికా  ప్రతినిధి  నిక్కీ హేలీ. వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య సంబంధాలు కలుపుకోవడానికే ఇండియా టూర్ కి వచ్చానని తెలిపారు. భారత్ తో సంబంధాలను బలోపేతం చేయడమే టూర్ ప్రధాన లక్ష్యం అన్నారు. బుధవారం (జూన్-27) న్యూఢిల్లీలోని హుమాయున్ సమాధిని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

భారత్ –అమెరికా మధ్య మంచి రిలేషన్ ఉందని, భవిష్యత్తులో ఈ బంధానికి మరింత బలం చేకూరేలా అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం (జూన్-27) నుంచి 28 వరకు భారత్‌ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు భారత అధికారులతోనూ, ప్రముఖ NGO నాయకులతోనూ సమావేశమవుతానని తెలిపారు. ఈ సందర్భంగా నిక్కి హాలి..కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు.

Posted in Uncategorized

Latest Updates