అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. ముగ్గురు మృతి

AMERICAఅమెరికాను మంచు తుఫాన్ గజగజ వణికిస్తోంది. గల్ఫ్  తీరం నుంచి గ్రేట్  లేక్స్  ప్రాంతం వరకు ఏర్పడిన తుఫాను.. అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచు, చలిగాలులు, వర్షాలు, వడగళ్ల కారణంగా వందలాది విమానాలను రద్దు చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. రన్ వేపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో మిన్నియాపోలిస్ -సెయింట్  పాల్  ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలను రద్దు చేశారు. దక్షిణ డకోటాలో అతిపెద్ద నగరమైన సియోక్స్  ఫాల్స్ లోనూ విమానాశ్రయాన్ని వరుసగా రెండోరోజూ మూసేశారు. మిన్నియాపోలిస్ లో శనివారం రాత్రి 33 సెంటిమీటర్ల మంచు కురిసింది.వర్షాలు భారీగా కురుస్తుండటంతో యాంకీస్ , టైగర్స్  నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మిన్నెసోటా, విస్కాన్సిన్ , మిచిగాన్  మీదుగా న్యూయార్క్ , న్యూఇంగ్లాండ్ ను తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates