అమెరికాలో అగ్ని ప్రమాదం : ముగ్గురు నల్గొండ జిల్లా వాసుల మృతి

అమెరికాలోని  కొలిర్ విలిలో  అగ్నిప్రమాదం  జరిగింది. ఓ ఇంట్లో ఇవాళ మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో నలుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు నల్లగొండ  జిల్లాకు  చెందినవారు. ఒకే  కుటుంబానికి చెందిన  అక్క, చెల్లె,  తమ్ముడు.. సాత్విక్  నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్  మంటల్లో చనిపోయారు. దేవరకొండ  నియోజకవర్గం …నేరెడుగొమ్మ  మండలం …గుర్రపుతండాకు  చెందిన  శ్రీనివాస్ నాయక్ తమ పిల్లలను  అమెరికాలో చదివిస్తున్నాడు.  అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి  చెందిన  ముగ్గురు చిన్నారులు  చనిపోవటంతో.. తండాలో  విషాద ఛాయలు అలుముకున్నాయి.

Posted in Uncategorized

Latest Updates