అమెరికాలో కాల్పుల కలకలం..వృద్ధురాలు మృతి

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో కాల్పుల మోత మోగింది. ఆదివారం (జూలై-22) తన బామ్మ, ప్రేయసిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో వృద్ధురాలు మృతిచెందగా.. యువతి గాయపడింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన దుండగుడు ఓ సూపర్‌ మార్కెట్‌ లోకి ప్రవేశించాడు. వినియోగదారులను బందీలుగా చేసుకుని పోలీసులకు కాల్పులు జరిపాడు. మూడు గంటల పాటు హల్‌ చల్‌ సృష్టించిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized