అమెరికాలో దారుణం : స్కూల్లో కాల్పులు..10 మంది విద్యార్థులు మృతి

TEXASఅమెరికాలోని టెక్సాస్ శుక్రవారం (మే-18) కాల్పులతో దద్దరిల్లింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది విద్యార్థులు చనిపోయారు. శాంటా హైస్కూల్లో ఘటన జరిగింది. కాల్పులు జరిపిన దుండగుడిని అరెస్టు చేశారు పోలీసులు. తుపాకీతో స్కూల్లోకి వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు స్థానికులు.

ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్కూల్లో మొత్తం 14 వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates