అమెరికాలో భార్యను వేధించిన భర్త…పుట్టింటికి వచ్చి ఆత్మహత్య

కన్నకూతురు భవిష్యత్తు బాగుంటుందని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు.  తమ కూతురును అల్లుడు యూఎస్ తీసుకెళ్లాడని సంతోషించారు. చివరకు విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. అల్లుడి వేధింపులకు తమ కూతురు బలి కావడంతో తల్లడిల్లిపోయారు.

నేరేడ్‌ మెట్‌ కాకతీయనగర్‌ లో నివాసం ఉంటున్న గంగాధరి, మాల్యాద్రిల స్వస్ధలం ఏపీలోని ప్రకాశం జిల్లాలోని కందుకూరు. 20ఏళ్లుగా సికింద్రాబాద్‌ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు మాధురి(23)ని బీటెక్‌ చదివించారు. షాపూర్‌ నగర్‌ లో నివాసముంటున్న ఒంగోలుకు చెందిన సుబ్బులు, వెంకటేశ్వర్లు కొడుకు కోటేశ్వరరావు(27)తో 2016 నవంబర్-9 మాధురి పెళ్లి జరిగింది. కోటేశ్వరరావు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి తర్వాత భార్య మాధురిని కోటేశ్వరరావు అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. భార్యను లోదుస్తులు ధరించి, మద్యం తాగాలని, పేకాట ఆడాలని కోటేశ్వరరావు బలవంతం చేసేవాడు. మాట వినడం లేదని మాధురిని చావగొట్టేవాడు. అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక మాధురి గతంలోనే పుట్టింటికి వచ్చేసింది. అయితే ఇరుకుటుంబాల పెద్దలు నచ్చజెప్పి అమెరికాకు పంపారు. అయినా కోటేశ్వరరావులో మార్పు రాలేదు. మాధురి ఈనెల 11న తిరిగి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని వివరించింది. శనివారం(అక్టోబర్-13) ఉదయం ఇంట్లో ఎవరూలేని టైంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates