అమెరికాలో మంచు తుఫాను.. 1,000 విమానాలు రద్దు

యునైటెడ్ స్టేట్స్ లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అనేక రాష్ట్రాల్లో జన జీవనం ఇబ్బందిగా మారింది. ప్రయాణాలు దాదాపుగా వాయిదాపడ్డాయి. ఇప్పటికే రోడ్డు మార్గాలు, హైవేలు మంచు కారణంగా బ్లాక్ అయ్యాయి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తున్నా…. తుఫాను ప్రభావానికి నిమిషాల్లోనే మంచు పేరుకుపోతోంది. అటు వాయుమార్గంలోనూ రవాణాకు మంచు తుఫాను ఆటంకం కలిగిస్తోంది. గురువారం వరకు వెయ్యి విమానాలు రద్దు చేసినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. మరో 4వేల 2వందల విమానాలను ఆలస్యంగా నడుపుతున్నట్టు చెప్పారు.

మోకాలి లోతు మంచు కురుస్తుండటంతో… కొద్దిరోజులుగా వేలాది విమానాల సర్వీసులు ఆపేశారు. డాలస్ నగరంలో.. ఒక కమర్షియల్ జెట్ విమానం టైర్ రన్ వేపై స్లిప్ కావడంతో.. ఓ ప్యాసింజర్, పైలట్ గాయపడ్డారు. డాలస్ లోని ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 400 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వేలాది విమానాలు లేట్ అవుతున్నాయి.

పలుచోట్ల మంచు తుఫాను.. భారీవర్షాలకు… వరదలకు కారణమవుతోంది. టెక్సాస్, లూసియానా, మిసిసిప్పి, అలబామా సహా.. దక్షిణాది యూఎస్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు, వరదలకు అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates